‘గాంధీ పేరు రూపుమాపే కుట్ర’
ఎల్లారెడ్డిరూరల్: గాంధీ పేరు రూపుమాపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ ఆరోపించారు. ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత మల్లికార్జున్ మాట్లాడుతూ నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రజల కోసం మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం ప్రారంభించారన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం గాంధీజీ పేరు తొలగించడం సరి కాదన్నారు. ఉపాధిహామీ పథకం పేరును కొనసాగించాలని గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని, పరిషత్ ఎన్నికలలోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ రజిత, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు వినోద్‌గౌడ్, నాయకులు ఊషాగౌడ్, గోపి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.


