ఆలయ ముఖ ద్వారాల తయారీలో ప్రత్యేక గుర్తింపు
దేవుడిచ్చిన వరం
బ్రహ్మచారి చేతిలో రూపుదిద్దుకున్న ఆలయ దర్వాజాలు, ముఖ ద్వారాలు
కర్రపై కళాఖండాన్ని చెక్కుతున్న బహ్మచారి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని సదాశివనగర్ మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి కర్రపై అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదువుకుంటూనే వుడ్ కార్వింగ్‌పై దృష్టి పెట్టాడు. పదో తరగతి పూర్తవగానే పూర్తి స్థాయి సమయం కార్వింగ్‌కు కేటాయించాడు. ఎప్పటికప్పుడు తన మేధస్సును పెంపొందించుకుంటూ అద్భుతమైన విగ్రహాలు, కళాకండాలను రూపొందిస్తూ అందరి మన్ననలు అందుకున్నాడు. విగ్రహాలు, ఆలయ ముఖ ద్వారాలు, పెద్ద దర్వాజాలు, రథాలు తయారు చేస్తున్నాడు. భారీ ఖర్చుతో నిర్మించుకునే బంగళాలకు అవసరమైన ప్రధాన ద్వారాలు కూడా తయారు చేస్తాడు.
ఆధునిక భవనాలు నిర్మించుకునేవారు ఇంట్లో కర్రతో చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపు తుండడంతో బ్రహ్మచారి వి గ్రహాల తయా రీపై ఫోకస్ చేశా డు. గణపతి, నరసింహస్వామి, అ య్యప్ప, సరస్వతీ మాత వంటి దేవతామూర్తుల విగ్రహాలెన్నో ఆ యన తయా రు చేశాడు. విగ్రహాన్ని చెక్కడానికి అవసరమైన కర్ర తెప్పించుకుని మొదలుపెడతారు. ఒక్కో విగ్రహం తయారీకి పది రోజుల సమయం పడుతుందని చెబుతున్నాడు. విగ్రహాలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ఎవరికి ఏ విగ్రహం కావాలన్నా సరే ముందుగా ఆర్డర్ ఇస్తే స్వయంగా తానే చెక్కుతాడు.
దేవాలయాలకు అవసరమైన రథాలను బ్రహ్మచారి పూర్తిగా కర్రతోనే తయారు చేస్తాడు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు వీలుగా రథాలు తయారు చేసి ఇవ్వడంలో ఆయనది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. ఆలయ ముఖద్వారాలు, ప్రధాన ద్వారాలతోపాటు రథాలను తయారు చేయడంలో ఎంతో పేరు సంపాదించాడు. అలాగే భారీ ఖర్చుతో నిర్మించే ఇళ్లకు మెయిన్ డోర్‌లు తయారు చేస్తాడు. వందలాది ఇళ్లకు ఆయన డోర్లు తయారు చేశాడు.
ఆయన చేయి పడిందంటే కర్ర(కట్టె) జీవం ఉట్టిపడే విగ్రహమవుతుంది. ఆలయ ముఖ ద్వారాలు.. ఉత్సవ విగ్రహాలు.. రథాలను తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. కర్రను చెక్కి దేవుడిని సృష్టిస్తున్న అపరబ్రహ్మగా గుర్తింపు పొందాడు కమ్మరి బ్రహ్మచారి.
కర్రను చెక్కి దేవుడిని సృష్టించే
అపర బ్రహ్మ!
విగ్రహాల తయారీలో ఆయనది
అందెవేసిన చేయి
ఆలయ ముఖ ద్వారాలు, రథాల తయారీలో నిష్ణాతుడు
బ్రహ్మచారి చేతిలో
రూపుదిద్దుకుంటున్న కళాకండాలను
దేవాలయాలకు ముఖ ద్వారాల తయారీలో బ్రహ్మచారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కామారెడ్డి జిల్లాలోతోపాటు పొరుగున ఉన్న నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ తదితర జిల్లాల నుంచి ఆయనకు ఆర్డర్లు వస్తుంటాయి. కొన్ని ముఖద్వారాలైతే 15 నుంచి 21 ఫీట్లు ఎత్తువి తయారు చేయాల్సి ఉంటుంది. అలాంటివి ఎన్నో ఆయనకు ఆర్డర్లు వస్తుంటాయి. కొన్ని ఆలయాలకు పెద్ద దర్వాజాతోపాటు రథం తయారీకి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వ్యయం అవుతుంది. అలాంటివి ఆయన ఎన్నో తయారు చేసి ఇచ్చాడు.
దేవుని విగ్రహాలు, ఆలయాల ముఖ ద్వారాలు, రథాలు తయారు చేయించే అవకాశం దేవుడే క ల్పించాడేమో అనిపిస్తుంది. మా తాత, తండ్రు లు ఇదే పని చేశారు. నేను వారిని అనుసరించా ను. అయితే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చే స్తూ చెక్కడంలో రాణించాను. దేవుని గుడులకు అవసరమైన ప్రధాన ద్వారాలు, ముఖద్వారా లు, రథాలు, దేవుని విగ్రహాలు తయారు చేయడంలో ఎంతో సంతృప్తి ఉంది.
– బ్రహ్మచారి, కళాకారుడు
ఆలయ ముఖ ద్వారాల తయారీలో ప్రత్యేక గుర్తింపు
ఆలయ ముఖ ద్వారాల తయారీలో ప్రత్యేక గుర్తింపు
ఆలయ ముఖ ద్వారాల తయారీలో ప్రత్యేక గుర్తింపు


