మేధో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మేధో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి

Dec 28 2025 8:29 AM | Updated on Dec 28 2025 8:29 AM

మేధో

మేధో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి

కామారెడ్డి క్రైం: విద్యార్థులు తమ మేధోసామర్థ్యాన్ని మెరుగుపర్చుకుని ఉన్నత స్ధానా ల్లో నిలవాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నా రు. చెస్‌ నెట్‌వర్క్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చెస్‌ బోర్డులను శనివారం కలెక్టరేట్‌లో పంపిణీ చే శారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. చెస్‌తో విద్యార్థుల ఏకాగ్రత, క్రమశిక్ష ణ, నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. అ నంతరం విద్యార్థులతో చెస్‌ ఆడి వారిని ఉ త్సాహపరిచారు. కార్యక్రమంలో డీఈవో రా జు, ప్రవాస భారతీయుడు రాజిరెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి సిద్ధిరాంరెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ కలెక్టర్‌

విక్టర్‌కు సన్మానం

కామారెడ్డి అర్బన్‌ : తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ వి.విక్టర్‌ను తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల (టీజీవో) సంఘం, టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో శనివారం వేర్వేరుగా సన్మానించారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు దేవేందర్‌, కార్యదర్శి సాయిరెడ్డి, ప్రతినిధులు రాజలింగం, సంతోష్‌కుమార్‌, ఠాగూర్‌, నిజాం, తురబ్‌అలీ, శశికిరణ్‌, శివకుమార్‌, సతీశ్‌కుమార్‌, టీ ఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాల వెంకట్‌రెడ్డి, ముల్క నాగరాజు, అసోసియేట్‌ అధ్యక్షుడు చక్రధర్‌, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి రచన పోటీల్లో

యశశ్రీకి ప్రథమ బహుమతి

కామారెడ్డి అర్బన్‌ : తెలంగాణ సాహిత్య అ కాడమీ తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థా యి నాటిక రచన పోటీల్లో కామారెడ్డి మండ లం లింగాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం యశశ్రీ రాసిన ‘మా వూరి మల్లన్న జాతర’ రాష్ట్రస్థాయి ప్రథమ బహు మతి దక్కింది. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో శనివారం నిర్వహించిన బాలల సాహితీ సృజన సదస్సులో యశశ్రీకి రూ. 2,500 నగదుతోపాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అలాగే లింగాపూర్‌కు చెందిన ఎం శ్రీజ రాసిన ‘పూలజాతర’ నాటి కకు ప్రోత్సాహక బహుమతిగా రూ.వెయ్యి నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశా రు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, సాహిత్య అ కాడమీ కార్యదర్శి బాలాచారి, బాలచెలిమి సంపాదకులు వేదకుమార్‌, పలువురు బాల సాహితీవేత్తలు పాల్గొన్నారు.

ఇబ్బందులు లేకుండా

యూరియా పంపిణీ

కామారెడ్డి క్రైం: ‘యూరి యా బుక్‌ చేసేదెలా?’, ‘యూరియా కష్టా’ శీర్షిక న ‘సాక్షి’లో ఈ నెల 25వ తేదీన కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యూరియా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామ ని డీఏవో మోహన్‌ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భిక్కనూర్‌ మండలం కాచాపూర్‌ సింగిల్‌ విండో ద్వారా 222 మంది రై తులకు 444 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు ఏర్కొన్నారు. కానీ అదే రోజు ఉద యం కార్యాలయం తెరవకముందే రైతులు వచ్చి పాస్‌పుస్తకాలను వరుస క్రమంలో పెట్టడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంతో యూరియా పంపిణీపై దుష్పచారం జరిగిందని వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

జిల్లాలో ఫెర్టిలైజర్‌ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. రైతులు ఆందోళనకు గురి కావొద్దన్నారు.

మేధో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి
1
1/3

మేధో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి

మేధో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి
2
2/3

మేధో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి

మేధో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి
3
3/3

మేధో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement