రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
● మృతులు ఆర్మూర్ మండలం మంథని వాసులు
● కొండగట్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా కోరుట్లలో చోటుచేసుకున్న ఘటన
ఆర్మూర్: మండలంలోని మంథని గ్రా మా నికి చెందిన దంపతులు జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో మృతిచెందారు. గ్రామానికి చెందిన దంపతులైన కత్రాజ్ మోహ న్, రాధ తమ కూతురు కీర్తితో కలిసి శనివారం కొండగట్టు దర్శనానికి వెళ్లారు. తి రిగి కారులో వారు స్వగ్రామానికి వస్తుండగా కోరుట్ల సమీపంలో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ ప్రమాద స్థలిలోనే మృత్యువాత పడ్డారు. కూతురు కీర్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెట్‌ప ల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించడంతో మంథనిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
నవీపేట: మండల కేంద్రంలోని ప్రయివేట్ హాస్టల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. మోపాల్ మండలంలోని బాడ్సికి చెందిన మేడ్చల్ సూర్య(18) నవీపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న అక్షయ మెస్, ప్రయివేట్ హాస్టల్ ఉంటున్నాడు. ఎప్పటిలాగే శనివారం సాయంత్రం కళాశాల నుంచి వచ్చిన అతడు హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు కరెంట్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ నిర్వాహకుడు దేవెందర్‌కు సమాచారమిచ్చారు. ఎస్సై యాదగిరిగౌడ్, ఏఎస్సై గఫార్ ఘటన స్థలాన్ని పరిశీలింరు. మృతుడి తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు.


