
‘ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి’
బాన్సువాడ: వినాయక ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర, డీఎస్పీ విఠల్‌రెడ్డిలతో కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కల్కి చెరువు వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. పట్టణంలోని పాత బాన్సువాడ, కొత్త బాన్సువాడలో కాలినడకన పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్, పోలీసు, రెవిన్యూ, అగ్నిమాపక, విద్యుత్, ఆరోగ్య, ఇరిగేషన్ తదితర శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి అపశృతి జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.