
క్రమబద్ధీకరణ ఎప్పుడో!
న్యూస్‌రీల్
ఫీజు చెల్లించి నెలలు గడుస్తున్నా ముందుకు సాగని ప్రక్రియ ఇబ్బంది పడుతున్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు
బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 10లో u
కామారెడ్డి టౌన్ : ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించినా.. ఫైల్ ముందుకు కదలడం లేదు. దీంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరణ కోసం మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు అనుసంధానం చేశారు. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించగానే మున్సిపల్ శాఖ క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగతా రెండు శాఖలు ఆన్‌లైన్‌లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి మున్సిపల్ శాఖకు పంపుతాయి. చివరగా టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలించి క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేసి దరఖాస్తుదారుకు సర్టిఫికెట్ అందిస్తారు. అయితే ఈ మూడు శాఖల మధ్య సమన్వయ లోపంతో జిల్లాలో చాలా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఎల్‌ఆర్‌ఎస్ –2020 పథకం ద్వారా జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో కలిపి 20,501 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరినుంచి మే వరకు 25 శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో 5,297 మంది దరఖాస్తు ఫీజు చెల్లించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం 17,687 మంది దరఖాస్తు చేసుకోగా 15,275 దరఖాస్తులకు ఆమోదించారు. ఇందులో 4,694 మంది ఫీజు చెల్లించగా 2,332 దరఖాస్తులను పరిష్కరించి వాటి యజమానులకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బాన్సువాడ మున్సిపాలిటీలో 1,903 దరఖాస్తులు రాగా 1,519 దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇందులో 358 మందే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించగా.. 217 ఆర్జీలకే ఉత్తర్వులు ఇచ్చారు. ఎల్లారెడ్డిలో 911 దరఖాస్తులు రాగా 691 ఆమోదించారు. ఇందులో 245 మంది ఫీజు చెల్లించగా 178 దరఖాస్తలు పరిష్కారం కావడంతో సర్టిఫికెట్లు అందించారు. దరఖాస్తు ఫీజు చెల్లించినవాటిలో ఇంకా సగం వరకు దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో దరఖాస్తుదారులు నిత్యం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూడు శాఖల మధ్య సమన్వయ లోపంతోనే దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదన్న విమర్శలున్నాయి. క్రమబద్ధీకరణతో బల్దియాలకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా అధికారులు అనుసరిస్తున్న తీరుతో దరఖాస్తుదారులు విసిగిపోతున్నారు. బల్దియాలో కౌంటర్‌లు ఎత్తివేయడం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంపై అర్జీదారులు మండిపడుతున్నారు. త్వరగా తమ ప్లాట్లను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.
దేవునిపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి తన ప్లాటును క్రమబద్ధీకరించడం కోసం ఫీజు మొ త్తం చెల్లించాడు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడదామనుకున్నా అనుమతి రావడం లేదు. బల్దియా అధికారులను ప్రశ్నించగా ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉందని సంబంధిత శాఖతో మాట్లాడి పరిష్కారం చూపుతామని చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదని ఆవేదన చెందుతున్నాడు.
పట్టణానికి చెందిన ఓ ఉద్యోగి విలీన గ్రామంలోని తన ఖాళీ స్థలాన్ని క్రమబద్ధీకరించుకో వడం కోసం ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫీజును ఆరు నెలల క్రితమే చెల్లించాడు. కానీ ఇప్పటివరకు అతని ప్లాట్ క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. దరఖాస్తు ఎల్–1 లో పెండింగ్‌లో ఉందని చూపించడంతో బల్దియాలో అధికారులను సంప్రదించాడు. వారు. ఇరిగేషన్‌కు సంబంధించిన కారణాన్ని చూపుతున్నారు. నెలలు గడుస్తున్నా ఆ దరఖాస్తు అక్కడినుంచి కదలడంలేదు.

క్రమబద్ధీకరణ ఎప్పుడో!