
‘సీసీ కెమెరాల ఏర్పాటులో జిల్లాకే ఆదర్శం’
గాంధారి : మండల కేంద్రంలో ఒకేసారి 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం, జిల్లాకే ఆదర్శమని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఆయన అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులుతో కలిసి నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 42 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానించడంతో నేరాల నియంత్రణ జరుగుతుందన్నారు. నేరాలు జరిగినా నేరస్తులు తేలికగా పట్టుబడతారన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహాయం చేసిన వారిని ఎస్పీ సన్మానించారు. కార్యక్రమంలో పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలల్లో స్పాట్ అడ్మిషన్లు
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని ఆరు ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్లు డీఈవో రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికిగాను ఆరో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. బాన్సువాడ మండలం కొత్తాబాదిలో 110, మద్నూర్ మండలం మేనూర్‌లో 203, నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట్‌లో 139, నిజాంసాగర్ మండలం అచ్చంపేట్‌లో 125, ఎల్లారెడ్డిలో 148, సదాశివనగర్‌లో 74 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, పూర్తివివరాలకు సంబంధిత పాఠశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని సూచించారు.
యూరియా కోసం రైతుల ధర్నా
భిక్కనూరు : యూరియా కోసం మంగళవారం కాచాపూర్ సింగిల్‌విండో గోదాము వద్ద రైతులు ధర్నా చేశారు. సుమారు గంట పాటు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియాను పంపించి రైతులకు మేలు చేయాలని కోరారు.
స్పాట్ కౌన్సెలింగ్‌కు ఏడు దరఖాస్తులు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన స్పాట్ కౌన్సిలింగ్‌కు ఏడు దరఖాస్తులు వచ్చాయని ప్రిన్సిపల్ ఆరతి తెలిపారు. 28, 29వ తేదీల్లోనూ స్పా ట్ కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.