
కమీషన్ బకాయిలు చెల్లించాలి
● రేషన్ డీలర్ల డిమాండ్
● లేకపోతే బియ్యం పంపిణీని
బహిష్కరిస్తామని హెచ్చరిక
కామారెడ్డి రూరల్: తమకు రావాల్సిన ఐదు నెలల కమీషన్‌ను ఈనెలాఖరులోగా చెల్లించాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చేనెలలో బియ్యం పంపిణీని బహిష్కరిస్తామని హెచ్చరించా రు. మంగళవారం జిల్లాలోని రేషన్ డీలర్లు జిల్లాకేంద్రంలో ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ అధ్యక్షుడు సురేందర్ మాట్లాడుతూ పాత బకాయిలు చెల్లించాలని, బియ్యం పంపిణీ అయిపోగానే కమీషన్ వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం, క్వింటాలుకు రూ. 300 కమీషన్ ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు రాజు, గౌరవ అధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్, ప్రతినిధులు హేంసింగ్, మల్లారెడ్డి, శ్రీనివాస్, రాజు, సంతోష్‌రావు, శంకర్‌రావు, లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు.