
టీచర్‌పై సస్పెన్షన్ వేటు
బిచ్కుంద: శెట్లూర్ పాఠశాల ఉపాధ్యాయురాలు స్వ ప్నపై ఉన్నతాధికారులు మంగళవారం సస్పెన్షన్ వే టు వేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సోమవారం 22 మంది విద్యార్థులు వాంతు లు చేసుకొని అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం తహసీల్దార్ వేణుగోపాల్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో గోపాల్ పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. టీచర్ సరైన పర్యవేక్ష ణ చేయకపోవడంతోనే ఇలా జరిగిందని అధికారు ల విచారణలో తేలింది. దీంతో ఉన్నతాధికారుల ఆ దేశాల మేరకు ఎంఈవో ఉపాధ్యాయురాలు స్వ ప్నకు సస్పెన్షన్ లెటర్ అందించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా ఏజెన్సీ నిర్వహకులను పెట్టుకోవాలని హెచ్‌ఎం ఖాజాకు సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు వాటర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లో పరీక్షించారు. నీరు కలుషితం కావడం లేదని రిపోర్ట్ వచ్చిందన్నారు.
సస్పెన్షన్ వద్దని స్థానికుల ఆందోళన...
అనుకోకుండా జరిగిన ఘటనకు ఉపాధ్యాయురాలు స్వప్న కారణం అంటూ అధికారులు సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని శెట్లూర్ వాసులు పేర్కొన్నారు. మంగళవారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయురాలు స్వప్నను బలి చేయవద్దని ఆమె వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఉన్నాతాధికారులు ఆలోచించి సస్పెన్షన్ వేటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తహహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.
● మధ్యాహ్న భోజన ఏజెన్సీ తొలగింపు
● వంట సామగ్రిని పరిశీలించిన అధికారులు