
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
దోమకొండ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని గడికోటలో మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించిన వారిని అభినందించారు. మండలంలోని 10 పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఆర్చరీ పోటీలు నిర్వహించారు.
మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనుమతులు లేకుండా సెలవులు పెట్టరాదని ఉపాధ్యాయులకు సూచించా రు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యా హ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి వెంకటేశ్వర్ గౌడ్, మండ ల ప్రత్యేకాధికారి జ్యోతి, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఆర్చరీ కోచ్ ప్రతాప్‌దాస్, నాయకులు తీగల తిర్మల్‌గౌడ్, నల్లపు అంజలి, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జి పాల్గొన్నారు.