
సాధారణ కాన్పులే అధికం
బాన్సువాడ : కడుపు కోతలను నివారించి, సాధారణ ప్రసవాలను పెంచడమే లక్ష్యంగా బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రి వైద్యులు కృషి చేస్తున్నారు. గర్భిణులకు అవగాహన కల్పిస్తూ నార్మల్ డెలివరీలు చేస్తున్నారు.
బాన్సువాడ, జుక్కల్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాలతో పాటు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బాన్సువాడలో మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ప్రారంభించినప్పటి నుంచి ఇక్కడ సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజు నాలుగైదు కాన్పులు చేస్తున్నారు. ఇక్కడి వైద్యులు గర్భిణులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి సాధారణ కాన్పులకే మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో సగానికిపైగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. అవసరం అయితేనే సిజేరియన్ చేస్తున్నారు.
బాన్సువాడ ఎంసీహెచ్‌లో
సగానికిపైగా నార్మల్ డెలివరీలే
ఎంసీహెచ్‌లో నమోదైన ప్రసవాలు..
నెల సిజేరియన్ నార్మల్
జనవరి 125 169
ఫిబ్రవరి 97 139
మార్చి 118 165
ఏప్రిల్ 163 163
మే 147 157
జూన్ 168 155
జూలై 162 183
మొత్తం 980 1,131
అవగాహన కల్పిస్తున్నాం
సాధారణ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన కల్పి స్తున్నాం. దీంతో బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి.
– విజయలక్ష్మి, ఇన్‌చార్జి సూపరింటెండెంట్, బాన్సువాడ

సాధారణ కాన్పులే అధికం