
బస్సులు లేక.. ముందుకు వెళ్లలేక
రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు ఊళ్లకు బయల్దేరిన అక్కాచెల్లెళ్లు పండుగ పూట చుక్కలు చూశారు. ఓ వైపు బస్సులు లేకపోవడం.. మరోవైపు పోలీసుల తనిఖీల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ పుట్టిళ్లకు శనివారం బయల్దేరిన మహిళలు రామారెడ్డి బస్టాండ్ వద్ద బస్సుల కోసం గంటలతరబడి పడిగాపులు కాశారు. మరోవైపు మండల కేంద్రం వైపు నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలో గొల్లపల్లి స్టేజ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టడంతో జరిమానాలకు భయపడి ఆటోలు, బైక్‌లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఊళ్లకు బయల్దేరిన మహిళలు మధ్యలోనే ఆగిపోయారు. పండగ పూట తమకు ఇదేం పరిస్థితి అని, సమయమంతా రోడ్లపైనే గడిచిపోయిందని విస్మయం వ్యక్తం చేశారు.
– రామారెడ్డి