
హైవే రూట్ మ్యాప్ రెడీ!
మద్నూర్(జుక్కల్) : ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న మద్నూర్–బోధన్ జాతీయ రహ దారి నిర్మాణ పనులకు చకచకా అడుగులు పడుతు న్నాయి. బడ్జెట్, డిజైన్, విస్తరణ, మౌలిక వసతు లు, సాంకేతిక అంశాలు తదితర వాటికి సంబంధించి పనులు ముందుకు సాగుతున్నాయి. మద్నూర్ మండల కేంద్రం నుంచి సిర్‌పూర్, నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్, కోటగిరి, రుద్రూర్ మీదుగా బోధన్ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ జాతీ య రహదారికి 161బీబీ అని నామకరణం చేస్తూ ప్రభుత్వం 2021లో గెజిట్ విడుదల చేసింది. మొద ట మద్నూర్, బోధన్, బాసర, బైంసా వరకు రోడ్డు ను ప్రకటించారు. కానీ మద్నూర్ నుంచి బోధన్ వరకు ఒక హైవేగా నిర్ధారించి బోధన్ నుంచి బైంసా వరకు రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బోధన్ నుంచి భైంసా వరకు 90 శాతం జాతీయ రహాదారి పనులు పూర్తి కాగా మద్నూర్ నుంచి బోధన్ వరకు పలు కారణాలతో ఆలస్యం జరిగిందని హైవే అధికారులు తెలిపారు.
రూ.640 కోట్లతో డీపీఆర్ సిద్ధం
మద్నూర్ నుంచి బోధన్ వరకు జాతీయ రహదారి 161బీబీకి రూ.640 కోట్ల అంచనాతో 39 కిలోమీటర్ల దూరంతో డీపీఆర్‌ను సిద్ధం చేశారు. మద్నూర్, డోంగ్లీ రెండు మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల శివారులోని భూమిని అధికారులు గుర్తించారు. మద్నూర్ మండలంలోని వాడి ఫత్తేపూర్ శివారులో 8 ఎకరాలు, మద్నూర్ శివారులో 5 ఎకరాలు, సోనాల శివారులో 17 ఎకరాలు, తడి హిప్పర్గా శివారులో 24 ఎకరాలు, మహల్సాపూర్ శివారులో 25 ఎకరాల భూమి జాతీయ రహదారికి అవసరం ఉందని సర్వే నిర్వహించారు. అలాగే డోంగ్లీ మండలంలోని లింబూర్ శివారులో 33 ఎకరాలు, హసన్ టాక్లీ శివారులో 13 ఎకరాలు, పెద్ద టాక్లీ శివారులో 16 ఎకరాలు, సిర్‌పూర్ శివారులో 21 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 142 ఎకరాల భూమి అవసరమవుతుందని ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులు చెప్పారు. మద్నూర్ నుంచి బోధన్ వరకు గల గ్రామాల పక్క నుంచి ఈ రహదారి వెళ్తుంది. హైవే పనులు పూర్తయితే దూర ప్రాంతాల కనెక్టీవిటీ మెరుగుపడుతుంది. వ్యాపారులకు, ప్రజలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. రోడ్డు నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రహదారిలో పలు భద్రతాప్రమాణాలు పాటించనున్నారు. మద్నూర్ నుంచి బోధన్ నిజామాబాద్‌కు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు పనుల నిమిత్తం వెళ్తుంటారు. హైవే నిర్మాణంతో భవిష్యత్‌లో ఆర్థికాభివృద్ధి పుంజుకోనుంది.
ముమ్మరమైన సర్వే పనులు
మద్నూర్ నుంచి బోధన్ వరకు సర్వే పనులు చకచకపూర్తవుతున్నాయి. నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే పనులు పూర్తి చేసి పెగ్ మార్కింగ్ వేయనున్నారు. నాలుగు వరుసల రహదారి కోసం భూసేకరణ పూర్తయిన వెంటనే పనులకు సంబంధించి టెండర్లు నిర్వహించనున్నారు.
రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు..!
హైవే నిర్మాణానికి అవసరం ఉన్న భూముల్లో సర్వే నిర్వహించామని, భూములు కోల్పోతున్న రైతుల వివరాలు, సర్వే నంబర్లను రెవెన్యూ అధికారులు నేషనల్ హైవే అధికారులకు పంపించారు. జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారంపై విచారణ నిర్వహించి రైతులకు మంచి ధర వచ్చేటట్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎకరానికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పరిహారం అందించేలా చర్యలు కొనసాగుతున్నట్లు తెలిసింది.
మద్నూర్ – బోధన్ జాతీయ
రహదారికి త్వరలో భూ సేకరణ
పెగ్ మార్కింగ్‌కు సర్వం సిద్ధం
39 కిలోమీటర్ల నాలుగు లైన్ల
జాతీయ రహదారి
9 గ్రామాల పరిధిలో 142 ఎకరాల భూమి అవసరం
జిల్లాకు మరో 161బీబీ
జాతీయ రహదారి

హైవే రూట్ మ్యాప్ రెడీ!

హైవే రూట్ మ్యాప్ రెడీ!