ప్లాస్టిక్‌ వినియోగించొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వినియోగించొద్దు

Aug 9 2025 5:57 AM | Updated on Aug 9 2025 5:57 AM

ప్లాస

ప్లాస్టిక్‌ వినియోగించొద్దు

ఎల్లారెడ్డి : ప్రతి ఒక్కరూ మార్కెట్‌కు వెళ్లే స మయంలో చేతి సంచులను తీసుకెళ్లాలని మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్‌కుమార్‌ అన్నా రు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌కు చేతి సంచులతో వచ్చిన వారికి శుక్రవారం ఆయన పూలు అందజేసి అభినందించారు. ప్లాస్టిక్‌ గ్లాస్‌లు వినియోగించుకుండా గాజు గ్లాస్‌లు వినియోగిస్తున్న హోటళ్ల యజమానులను ఆయన సన్మానించారు. ప్రతి ఒక్క రూ ప్లాస్టిక్‌ వినియోగానికి దూరంగా ఉండా లని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి జావెలిన్‌త్రోలో

బంగారు పతకం

కామారెడ్డి అర్బన్‌ : రాష్ట్రస్థాయి జావెలిన్‌ త్రో అథ్లెటిక్స్‌లో జిల్లాకు బంగారు పతకం దక్కింది. జనగామ జిల్లా ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించిన నాల్గో రాష్ట్రస్థాయి జావెలిన్‌ త్రో అథ్లెటిక్స్‌ మీట్‌–2025లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఎం.అమృత అండర్‌ –20 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించిందని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.జైపాల్‌రెడ్డి, కేపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. జట్టు కోచ్‌గా జి.నవీన్‌ వ్యవహరించారన్నారు. అమృతను పలువురు అభినందించారు.

రైతునేస్తంతో

లబ్ధి పొందాలి

కామారెడ్డి అర్బన్‌ : ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తంలో పాల్గొని లబ్ధిపొందాలని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. మండలంలోని ఇస్రోజివాడిలో సాగవుతున్న పంటలను శుక్రవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇస్రోజివాడి రైతు వేదిక, గ్రామపంచాయతీ కార్యాలయాలను సందర్శించారు. పంటల సస్యరక్షణ, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యంపై మాట్లాడారు. ఆయన వెంట ఏఈవో దేవేంద్ర, మార్కెట్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌రావు, తదితరులు ఉన్నారు.

నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 600 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగుల (17.8 టీఎంసీ)కు గాను ప్రస్తుతం 1390.95 అడుగులు (4.448టీఎంసీ)ల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 600 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ప్లాస్టిక్‌  వినియోగించొద్దు
1
1/3

ప్లాస్టిక్‌ వినియోగించొద్దు

ప్లాస్టిక్‌  వినియోగించొద్దు
2
2/3

ప్లాస్టిక్‌ వినియోగించొద్దు

ప్లాస్టిక్‌  వినియోగించొద్దు
3
3/3

ప్లాస్టిక్‌ వినియోగించొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement