భద్రతా భావాన్ని పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

భద్రతా భావాన్ని పెంపొందించాలి

May 30 2025 1:27 AM | Updated on May 30 2025 1:27 AM

భద్రత

భద్రతా భావాన్ని పెంపొందించాలి

కామారెడ్డి క్రైం: ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని డీజీపీ జితేందర్‌ సూచించారు. గురువా రం ఆయన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ రాజేశ్‌ చంద్ర పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయ ఆవరణలో డీజీపీ మొక్కలు నాటారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలో ని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రాధాన్యమైన కేసులు, నేరాల పరిశోధన, ప్రజలకు అందిస్తున్న సేవలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తాము సురక్షితంగా ఉన్నామన్న భావన ప్రజల్లో కలిగేలా పోలీసింగ్‌ ఉండాలన్నారు. ప్రతి కేసులో సమర్థవంతమైన, నిష్పక్షపాత దర్యా ప్తు జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించవచ్చన్నారు. సాంకేతికత ఉపయోగంలో దేశంలో నే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హైవే అథారిటీ, రవాణా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించడం, బాధితులకు అండగా నిలవడం, నేరస్తులకు శిక్ష పడేలా కేసుల విచారణ జరిపించడం తదితర అంశాల్లో జిల్లా అధికారుల పనితీరు బాగుందని ప్రశంసించారు. సమీక్షలో మల్టీ జోన్‌–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, నిజామాబాద్‌ సీపీ సాయి చైతన్య, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలి

పోలీసు అధికారులతో సమీక్షలో

డీజీపీ జితేందర్‌

సిబ్బందికి అభినందన

కామారెడ్డి క్రైం: ఇటీవల డయల్‌ 100 కాల్స్‌పై తక్షణమే స్పందించిన బ్లూకోల్ట్‌, పెట్రో కార్‌ పోలీసులను డీజీపీ అభినందించారు. బాన్సువాడ ఎస్సై తాజుద్దీన్‌, బాన్సువాడ కానిస్టేబుల్‌ శంకర్‌, పిట్లం కానిస్టేబుల్‌ రవిచంద్ర, పిట్లం హోంగార్డ్‌ మారుతిలను అభినందించి ప్రోత్సాహకంగా నగదు బహుమతిని అందించారు.

భద్రతా భావాన్ని పెంపొందించాలి1
1/1

భద్రతా భావాన్ని పెంపొందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement