విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవాలి
నిజామాబాద్‌రూరల్: విద్యార్థులు మంచి నడవడికను అలవరుచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. నగరంలో విద్యార్థులకు గత నెలలో రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయగా ఆదివారం ముగిసింది. ఈసందర్భంగా గంగాస్థాన్ ఫేజ్–2లోని రామకృష్ణ వివేకానంద ధ్యాన మందిరంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో హాజరై, మాట్లాడారు. రామకృష్ణ సేవా సమితి వేసవి శిక్షణ తరగతులు ప్రతి సంవత్సరం నిర్వహిస్తునందుకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు శిక్షణతోపాటు మహనీయుల బోధనలను అనుసరించాలన్నారు. అనంతరం రెడ్‌క్రాస్‌లో జాతీయ అవార్డు గ్రహీత తోట రాజశేఖర్, ఉపాధ్యాయులను సత్కరించారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సమితి ప్రతినిధులు, ఉపాధ్యాయులు సూర్య ప్రకాష్, సాయి ప్రసాద్, యోగా రాంచందర్, బొచ్చు గోపాల్, తోట రాజశేఖర్, వసంత్ పాటిల్, దీపక్, నాయక్, వినోద్, స్వరూప్, నర్సయ్య, గంగా ప్రసాద్, వినోద్, శ్రీనివాస్, శ్రీలేఖ, రమేష్, హనుమాండ్లు రాజేంద్రప్రసాద్, రాజ్‌కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు.


