నకిలీ విత్తనాలను అరికట్టాలి
కామారెడ్డి క్రైం : జిల్లాలో నకిలీ విత్తనాలు లేకుండా చేయాలని, ఇందుకోసం ఐదు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. వ్యవసాయ, పోలీసుశాఖలతో స మన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో శనివా రం నిర్వహిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిలా్‌ల్ వ్యాప్తంగా 34 వేల ఎకరాల్లో ఈ సారి పత్తి సాగవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ, పోలీసు అధికారులతో కూడిన జిల్లా స్థాయిలో ఒకటి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సు వాడ, బిచ్కుంద డివిజన్‌లలో మరో నాలుగు టా స్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్ర త్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి నకిలీ విత్తనా లు సరఫరా చేసే, విక్రయించే వారిపై కేసులు నమో దు చేయాలన్నారు. లైసెన్స్ లేని కంపెనీలు, వ్యాపారులు, గుర్తు తెలియని వ్యక్తులు, తెల్ల సంచుల్లో వి క్రయించే విత్తనాలు, గడువు ముగిసినవి, లేబుల్ సరిగా లేనివి, రాత్రికిరాత్రి గ్రామాల్లో తిరుగుతూ వి క్రయించేవి, జన్యుస్వచ్ఛత లేని వాటిని నకిలీ విత్తనాలుగా పరిగణించడం జరుగుతుందని, అలాంటి విత్తనాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. గతే డాది బీజీ–3 రకం పత్తి విత్తనాలు సాగు చేసిన, నకి లీ విత్తనాలతో నష్టపోయిన రైతుల, గ్రామాల వివరాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాలపై రైతులను చైతన్య పర్చాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మో సం చేస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని వ్యాపారులను హెచ్చరించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు వి క్రయిస్తే 89777 46219కు (ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ఫోన్ చేసి సమాచా రం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఏవో తిరుమల ప్రసాద్, పలువురు సీఐలు, ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు.
కేసుల విచారణ వేగవంతం చేయాలి
ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులకు సంబంధించి న మోదైన కేసుల విచారణను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన చట్టాలపై వి స్తృత అవగాహన కల్పించాలని సూచించారు. బాధితులకు చట్ట ప్రకారం పరిహారం అందేలా చూడాలన్నారు. ఎస్పీ రాజేశ్‌చంద్ర, ఆర్డీవో వీణ, ఎస్సీ సంక్షేమ అధికారిణి రజి త, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డీఎస్పీ లు, ఎన్జీవోలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తనిఖీలకు టాస్క్‌ఫోర్స్
బృందాల ఏర్పాటు
రైతులను మోసం చేస్తే పీడీ యాక్టు
సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్


