ఖానాపూర్‌లో ఒకరి ఆత్మహత్య
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో వడ్డెపు లక్ష్మీనర్సయ్య (40)అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ శనివారం తెలిపారు. లక్ష్మీనర్సయ్య భార్య రెండేళ్ల క్రితం ఇంట్లో గొడవపడి కూతురు, కొడుకుతో కలిసి తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం చెరువులో మృతదేహం తేలడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


