
సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
రామారెడ్డి : జిల్లా యువజన క్రీడశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడాధికారి జగన్నాథం పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన రామారెడ్డిలో సమ్మర్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ ...జిల్లాలో 10 సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నామని, రామారెడ్డిలో ఫుట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించామన్నారు. 34 మంది బాలబాలికలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. క్యాంప్‌ను సద్వినియోగం చేసుకొని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. ఈకార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సంజయ్ కుమార్, తహసీల్దార్, ఉమలత, ఎంపీడీవో తిరుపతి రెడ్డి ఎంఈవో ఆనంద్ రావు, కార్యదర్శి క్రాంతి కుమార్, సమ్మర్ కోచింగ్ నిర్వాహకులు బాలరాజు పాల్గొన్నారు.
శతాధిక వృద్ధురాలి మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు పుల్లూరి బాలవ్వ (101) సోమవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. మృతురాలికి 25మంది కూతుర్లు, మనమండ్లు, మనుమరాళ్లు ఉన్నారన్నారు. బాలవ్వ అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు.

సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి