
డ్రెయినేజీ నిర్మించక ఇబ్బందులు
దోమల బెడద ఎక్కువైంది
డ్రెయినేజీ లేకపోవడంతో మురుగు నిల్వ ఉంటుంది. దీంతో దోమలతో రోగాల బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి డ్రెయినేజీ నిర్మించాలి.
– స్వామిగౌడ్, స్థానికుడు
కంపు కొడుతోంది
తాత్కాలిక డ్రెయినేజీ నిర్మాణం కోసం కాలువ తీయడంతో మురికి నీరు చేరి కంపు కొడుతోంది.దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించాలి. – సాయికిరణ్, స్థానికుడు
మాచారెడ్డి: మండలంలోని గజ్యానాయక్ తండా చౌరస్తాలో నాలుగు లైన్ల రోడ్డు నిర్మించినప్పుడు రోడ్డుకిరువైపుల డ్రెయినేజీ నిర్మించకపోవడంతో మురుగు వీధుల్లో చేరి కంపుకొడుతోంది. ఎన్ని సార్లు అధికారులకు మొర పెట్టుకున్నా లాభం లేకుండా పోతోందని గ్రామస్తులు వాపోతున్నారు. దోమలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డ్రెయినేజీ నిర్మించాలని కోరుతున్నారు.ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి రిజ్వానా బేగంను సంప్రదించగా ప్రస్తుతం గ్రామ పంచాయతీలో నిధులు లేవని, నిధులు మంజూరైన తర్వాత డ్రెయినేజీ నిర్మాణాన్ని చేపడతామన్నారు.
గజ్యా నాయక్ తండా చౌరస్తాలో గ్రామస్తుల ఆవేదన
సమస్య పరిష్కరించాలని వినతి