వడ్లు కొనేదెప్పుడో?
ఒడ్డేపల్లిలో ధాన్యం కుప్పలు
● కొనుగోలు కేంద్రాలను
ప్రారంభించిన సర్కారు
● తూకాల ప్రారంభంలో జాప్యం
● పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
● మూడు వారాలుగా ధాన్యం
రాసుల వద్దే అన్నదాతల మకాం
● ఇబ్బంది పడుతున్న రైతులు
జిల్లావ్యాప్తంగా యాసంగి వరి కోతలు ఊపందుకున్నాయి. అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే చాలాచోట్ల ఇప్పటికీ తూకాలను మాత్రం మొదలుపెట్టలేదు. దీంతో రైతులు తరలించిన ధాన్యం రాశులు కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోతున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రారంభం కాని కాంటాలు..


