‘పోచారం’లో చేపపిల్లల విడుదల
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టులో సోమ వారం మెదక్ జిల్లా మత్స్య సహకార శాఖ ఆధ్వర్యంలో రెండో విడత చేపపిల్లలను వి డుదల చేశారు. ఈ సందర్భంగా మెదక్ జి ల్లా మత్స్య సహకారశాఖ ఏడీ మల్లేశం, పో చారం ప్రాజెక్టు మత్స్య సహకార సంఘం కా ర్యదర్శి శివయ్య మాట్లాడారు. ఇటీవల మొ దటివిడతలో 9.28 లక్షల చేపపిల్లలను విడుదల చేశామన్నారు. ప్రస్తుతం 3.24 లక్షల చేపపిల్లలను విడుదల చేశామని తెలిపారు. కార్యక్రమంలో పోచారం సర్పంచ్ సంజీవరావు, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారులకు ఏఎస్పీ సూచనలు
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని కిరాణ, జనరల్ స్టోర్స్ వ్యాపారులతో కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏఎస్పీ చైతన్యరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. మాంజా విక్రయాలపై వ్యాపారులకు పలు సూచనలు ఇచ్చారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినందున దానిని విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.
బాక్సింగ్‌లో
బంగారు పతకం
గాంధారి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి అర్జున్ గజానన్ దేశ్‌ముఖ్ ఓపెన్ బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటాడు. ఈనెల 28న హైదరాబాద్‌లోని జీ హెచ్‌ఎంసీ క్రీడా మైదానంలో శివాజీ మహా రాజ్ రాష్ట్రస్థాయి ఆహ్వానిత పోటీలు నిర్వ హించారు. ఇందులో అర్జున్ బంగారు పత కం సాధించాడని అధ్యాపకులు తెలిపారు.
ముందస్తు అరెస్టులు
కామారెడ్డి టౌన్: అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు రాజు, సాగర్ గౌడ్, హనుమాండ్లు, రవి తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిరంతర విద్యుత్ సరఫరాకు
ఇంటర్‌లింకింగ్ వ్యవస్థ
కామారెడ్డి అర్బన్: వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా నూతన సాంకేతిక మార్పులు చేపడుతున్నామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ రవీందర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సరఫరా కు అటంకం కలగకుండా ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. ఇంటర్ లింకింగ్‌తో విద్యుత్ అంతరాయాలు కనీసం రెండు గంటలకు తగ్గాయ న్నారు. కామారెడ్డి సర్కిల్‌లోని 134 విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఐదు 33 కేవీ లైన్లలో ఇప్పటికే ఇంటర్ లింకింగ్ వ్యవస్థను పూర్తి చేశామని, మిగిలిపోయిన ఐదు సబ్‌స్టేషన్లలో ఆరు లైన్ల పనులకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.
ఉత్తమ రక్తదాతల అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉత్తమ రక్తదాతలు, సేవా సంస్థలు, యువజన సంఘాలకు జాతీ య పురస్కారాలు అందించనున్నట్లు జిల్లా రక్తదాతల సమూహం వ్యవస్థాపకుడు బాలు తెలిపారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 94928 74006 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
‘పోచారం’లో చేపపిల్లల విడుదల
‘పోచారం’లో చేపపిల్లల విడుదల
‘పోచారం’లో చేపపిల్లల విడుదల


