రూ. 1,100లకే అంత్యక్రియల బాధ్యతలు
మాచారెడ్డి: గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలకు ఇబ్బంది కలగకుండా ఆ బాధ్యతను పంచాయతీ చూసుకోవాలని తీర్మానించినట్లు పాల్వంచ మండలం పరిదిపేట సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం గ్రామపంచాయతీ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. రూ. 1,100 లతో దరఖాస్తు చేసుకుంటే మృతుడి అంత్యక్రియల పూర్తి బాధ్యతలను పంచాయతీ భుజాన వేసుకుంటుందని పేర్కొన్నారు. కోతులు, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.


