సాఫ్ట్‌బాల్ చాంపియన్‌గా నిజామాబాద్
సుభాష్‌నగర్: మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ 10వ సబ్ జూనియర్ బాలుర చాంపియన్‌షిప్‌గా నిజామాబాద్ జట్టు నిలిచిందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి ప్రభాకర్‌రెడ్డి, మర్కంటి గంగామోహన్ సోమవారం తెలిపారు. ఫైనల్‌లో మెదక్ జిల్లా జట్టుపై 2–1 పరుగుల తేడాలో విజయం సాధించిందన్నారు. టోర్నీలో బెస్ట్ ఆల్ రౌండర్‌గా రేవంత్ నిలిచి బహుమతి అందుకున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా జట్టుకు కోచ్, మేనేజర్లుగా అనికేత్, తిరుపతి వ్యవహరించారు.


