ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలి

Apr 16 2025 11:32 AM | Updated on Apr 16 2025 11:32 AM

ఉద్యో

ఉద్యోగ భద్రత కల్పించాలి

భిక్కనూరు: విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్‌ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈమేరకు తెయూ సౌత్‌ క్యాంపస్‌లో మంగళవారం ‘సెక్రటేరియట్‌ ముట్టడి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తాత్కాలిక అధ్యాపకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పార్ట్‌ టైం అధ్యాపకులు, కాంట్రాక్ట్‌ అధ్యాపకులు పాల్గొన్నారు.

సూపర్‌ బీడీ బ్రాంచ్‌లను

తెరిపించాలి

కామారెడ్డి టౌన్‌: సూపర్‌ బీడీ కంపెనీ మూసి వేసిన 152 బ్రాంచ్‌లను తక్షణమే తెరిపించాలని తెలంగాణ బీడీ రోలర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10వేలకు పైగా బీడీ కార్మికులు ఈ కంపెనీలో పని చేస్తున్నారని అకారణంగా కంపెనీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించడం దారుణమన్నారు. తక్షణమే అన్ని బ్రాంచ్‌లను తెరిపించి కార్మికులకు ఉపాధినివ్వాలని డిమాండ్‌ చేశారు.

బహుజనులపై

దాడులు సరికావు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): బహుజనులపై దాడులు సరికావని, ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేదిలేదని మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్‌ రావు అన్నారు. మండలంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగంపేట్‌లో అకారణంగా అధికార పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ సాయిలుపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సాయిలుకు అండగా ఉంటామన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

నిరుపయోగంగా ధోబీఘాట్‌

బాన్సువాడ రూరల్‌: మండలంలోని కోనాపూర్‌ గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ధోబీఘాట్‌ నిరుపయోగంగా మారింది. అధికారులు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఏళ్లుగా వృథాగా మారడంతోపాటు శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి ధోబీఘాట్‌కు మరమ్మతులు చేపట్టి, నీటిసౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పీజీ సెమిస్టర్‌

పరీక్షా ఫలితాలు విడుదల

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ 1, 3వ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను వీసీ ప్రొఫెసర్‌ టీ యాదగిరి రావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం యాదగిరి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కే సంపత్‌కుమార్‌, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌, అడిషనల్‌ కంట్రోలర్‌ టీ సంపత్‌, పీఆర్‌వో ఏ పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఫలితాల వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌ www.telanganauniversity.ac. inలో పొందుపర్చినట్లు కంట్రోలర్‌ తెలిపారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి
1
1/2

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి
2
2/2

ఉద్యోగ భద్రత కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement