గుంతలకే పరిమితమైన ఇందిరమ్మ మోడల్‌హౌస్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్‌హౌస్ నిర్మాణం గుంతలకే పరిమితమైంది. నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి ఇందిరమ్మ మోడల్‌హౌస్ నిర్మాణం నాలుగునెలల్లో పూర్తి చేయాలని అధికారు లు ముందుగా నిర్ణయించారు. నాగిరెడ్డిపేటలో మా త్రం గత ఫిబ్రవరి ఒకటో తేదీన ఇందిరమ్మ మోడల్‌హౌస్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. మూడు నెలలు గడుస్తున్నా నిర్మాణ పనులు ముందుకు సాగక అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మండల వ్యవసాయ కార్యాలయం ఎదురుగా ఇందిరమ్మ మోడల్‌హౌస్ నిర్మాణం కోసం తీసిన గుంతలతో కార్యాలయానికి వచ్చేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ మోడల్‌హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలు సరిపోవనే కారణంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ఎవరూ మందుకు రావడం లేదని తెలుస్తోంది.
మోడల్‌హౌస్ నిర్మించేందుకు
ముందుకురాని కాంట్రాక్టర్లు
గుంతలకే పరిమితమైన ఇందిరమ్మ మోడల్‌హౌస్


