పరిష్కారం దొరికేనా? | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం దొరికేనా?

Apr 15 2025 1:58 AM | Updated on Apr 15 2025 1:58 AM

పరిష్కారం దొరికేనా?

పరిష్కారం దొరికేనా?

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : భూ భారతి ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగా ఎంపిక చేసిన మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా మార్పులు చేర్పులతో రాష్ట్రమంతటా అమలు చేయాలని సంకల్పించింది. కాగా లింగంపేట మండలంలో అనేక వివాదాలున్నాయి. గతంలో నకిలీ పాస్‌పుస్తకాల తయారు చేయడంతోపాటు వాటిపై రుణాలు తీసుకున్న ఉదంతాలు ఎన్నో వెలుగు చూశాయి. ఇప్పటికీ లింగంపేట మండలంలో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. చాలా గ్రామాల్లో అటవీ భూములు, ప్రభుత్వ భూములు, అసైన్‌మెంట్‌ భూములకు సంబంధించిన వివాదాలున్నాయి. రైతులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చింది. అయితే వాటిపై రైతులకు హక్కు లేదంటూ అటవీ అధికారులు పంటలను ధ్వంసం చేసిన సంఘటనలున్నాయి.

మండల కేంద్రంలోనూ వివాదాలు..

లింగంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు, జూనియర్‌ కాలేజీ భవనం ఉన్న భూములకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ధరణిలో వాటికి ఎలాంటి పరిష్కారం చూపలేదు. సాగు భూములు, నివాస గృహాలకు సంబంధించి కొన్ని సర్వే నంబర్లను ఫారెస్ట్‌ గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆ భూములకు పాస్‌ పుస్తకాలు జారీ కాలేదు. ఫలితంగా రైతులకు రైతుబంధు అందలేదు.

భూభారతి అయినా దారి చూపేనా...

ప్రభుత్వం భూములకు సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరిస్తామని చెబుతోంది. ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే దీనిని తీసుకువచ్చామంటోంది. ఈ నేపథ్యంలో లింగంపేట మండలంలో దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలకు భూభారతి ద్వారానైనా పరిష్కారం దొరుకుతుందా అన్న అంశంపై చర్చ నడుస్తోంది. రాష్ట్రానికి దిక్సూచిలా ఉండేలా ఇక్కడ అమలు జరిగితేనే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. సర్కారు తీసుకువచ్చిన నూతన పోర్టల్‌పై ఈ ప్రాంత రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

అసైన్డ్‌ పట్టాల లెక్క తేలేనా?

ప్రభుత్వాలు భూ మిలేని పేదలకు ము ఖ్యంగా దళితలు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు సంబంధించి చాలా వివాదాలున్నా యి. అప్పట్లో ఇష్టారీతిన పట్టాలు జారీ చేశారు. ప్రభుత్వాలు ఏటా కొందరికి అసైన్డ్‌ భూముల పట్టాలు ఇస్తూ పోయాయి. ఒక్కో సర్వే నంబరు లో ఉన్న భూవిస్తీర్ణం కన్నా ఎక్కువ విస్తీర్ణానికి ప ట్టాలు ఇచ్చారు. విస్తీర్ణం కన్నా ఎక్కువ పట్టాలు ఉండడంతో వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో త మకు పట్టా ఉందంటే తమకు ఉందంటూ గొడ వలకు దిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అ లాగే అటవీ భూముల్లో పోడు సేద్యం చేస్తున్న రై తులకు గతంలో ప్రభుత్వాలు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ ప ట్టాలు ఇచ్చాయి. అయితే పట్టాలు ఉన్నా అటవీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడంతో రైతులకు, అటవీ అధికారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

భూ వివాదాలను పరిష్కరించడంలో ధరణి విఫలమవడమే గాకుండా అనేక సమస్యలను తెచ్చిపెట్టిందని భావిస్తు న్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం.. దాని స్థానంలో భూ భారతి పోర్టల్‌ను తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో నాలుగు మండలాలను ఎంపిక చేసింది. అందులో జిల్లాలోని లింగంపేట మండలం ఒకటి. మంగళవారంనుంచి లింగంపేట మండలంలో భూభారతి పోర్టల్‌ పనిచేయనుంది. ఇక్కడి అధికారులు భూభారతి పోర్టల్‌ ద్వారానే భూ రికార్డుల పరిశీలన, సరిచేయడం, రిజిస్ట్రేషన్లు... ఇలా ప్రతీది చేపట్టనున్నారు.

ధరణి పోర్టల్‌ స్థానంలో

‘భూ భారతి’

పైలట్‌ ప్రాజెక్టుగా

లింగంపేట ఎంపిక

నేటి నుంచి

అమలుకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement