● ప్రమాదకరంగా గుంత
నస్రుల్లాబాద్(బాన్సువాడ) : మండలంలోని అంకోల్ గ్రామంలో ప్రధాన రహదారిపై గుంత ప్రమాదకరంగా ఉంది.డ్రెయినేజీ నీరు వెళ్లేందుకు నిర్మించిన కల్వర్టు యొక్క ఇనుప చువ్వలు పైకి లేచి ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కల్వర్టులో చెత్త నిండిపోవడంతో గుంతలు తీసి శుభ్రం చేశారు. గుంతలను అలాగే వదిలేశారు. కల్వర్టు సమీపంలో అంగన్‌వాడీ కేంద్రం ఉంది. సెంటర్‌కు వచ్చే చిన్నారులు గుంతలో పడే ప్రమాదం ఉంది. ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.


