చి‘వరి’కి మెడవిరుపు...
మాచారెడ్డి : మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లోని పలు గ్రామాల్లో ఒక వైపు ఎండిన పంటలు, మరోవైపు మెడవిరుపు తెగుళ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు మండలాల్లో కలిపి 22 వేల ఎకరాల్లో వరి పంట సాగైంది. భూగర్భజలాలపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు బోర్లు ఎత్తిపోయి, దీనికి తోడు ఎండలు పెరిగి పంటలు దెబ్బతిన్నాయి. మెడవిరుపు తెగుళ్లతో మరింత నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఒక వైపు తెగుళ్ల బెడద
మరోవైపు ఎండుతున్న వరి
ఆందోళనలో రైతులు


