చేసిన తప్పు ఊరకే పోదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజల పన్నులతో జీతాలు తీ సుకుంటున్న ఉన్నతాధికారులు ప్రజలకు సేవ చేయడంతో పాటు ప్రజల ఆస్తులను రక్షించడం, బా ధితులకు న్యాయం చేసేందుకు పనిచేయాలి. అయితే ఇందుకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో అధికారులు తగిన ఫలితం చవిచూడాల్సి వస్తోంది. బాధితుడి పోరాటంతో కోర్టు ఆదేశాల మే రకు ఐఏఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉ న్నతాధికారులపై కేసు నమోదైంది. తప్పుడు మా ర్గంలో వెళ్లేందుకు అధికారులను ప్రోత్సహించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ మాత్రం దుబాయ్ వెళ్లి వ్యా పారాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న, గతంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన చంద్రశేఖర్, మాజీ డీఎస్‌వో చంద్రప్రకాశ్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్‌రాజ్‌లపై వర్ని పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. 2022–23 సీజన్‌లో వర్ని మండలంలోని కిషోర్ అనే వ్యక్తికి చెందిన శ్రీనివాస రైస్‌మిల్లుకు కేటాయించిన ధాన్యం పంపించకుండానే పంపించినట్లు ఉన్నతాధికారులు చూపించారు. మ రింత ముందుకెళ్లి సదరు రైస్‌మిల్లు యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసేలా కథ నడిపించారు. కథ ఇంతటితో ఆగలేదు. ధాన్యం షకీల్ మిల్లుకు పంపించి, కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను కిషోర్‌కు చెందిన శ్రీనివాస రైస్ మిల్లు నుంచి ఇవ్వాలని ఒత్తిడి తేవడం గమనార్హం. ఈ విషయమై కిషోర్ నెలల తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఉన్నతాధికారులపై కేసు నమోదైంది.
● 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లకు గాను షకీల్‌కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే మిల్లుల పేరిట 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మిల్లుల్లో ఒక్క గింజ ధాన్యం కూడా మిల్లింగ్ చేయలేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబయి, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చాడు. ఓ 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఆర్‌కాం ఇండస్ట్రీస్ (వర్ని), అబ్ధుల్ ఐ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఎఫ్‌టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) వాళ్లకు ఇచ్చినట్లు చూపించాడు. ఈ నాలుగు మిల్లుల యజమానుల తో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ లవంతంగా ధా న్యం తీసుకున్న ట్లు లేఖలు ఇప్పించాడు. షకీ ల్ ఒత్తిడితోనే లేఖలు ఇ చ్చిన ట్లు సదరు మిల్లర్లు తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభు త్వం షకీల్‌కు చెందిన మిల్లులకు రూ.10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటివరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో పాటు, జరిమానా సైతం కట్టలే దు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ కాలం గడిపారు.
మరోవైపు కిషోర్ సంతకాన్ని ఫోర్జరీ చేసే కథ నడిపిన అధికారులే సీఎంఆర్ కిషోరే ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తూ రావడం విశేషం. ఈ విషయంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని షకీల్ దండుకున్న ధాన్యం డబ్బులను రికవరీ చేసేందుకు కృషి చేస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అదనపు కలెక్ట ర్, మాజీ డీసీవో, డీటీలపై కేసులు నమోదయ్యాయి.
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
అధికారంలో ఉన్న సమయంలో..
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బో ధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కోట్లాది రూపాయల విలువజేసే ధాన్యాన్ని ప్రభుత్వం వద్ద తీసుకుని ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారీతిన దందా చేశా డు. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ధాన్యం ఇవ్వకుండానే కిషోర్ మిల్లు నుంచి సీ ఎంఆర్ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయించాడు. అయితే అధికారం పోవడంతో షకీల్ తక్షణమే దుబాయ్ వెళ్లిపోయాడు. జిల్లాలో మొత్తం 41 మంది మిల్లర్లను ప్రభుత్వం డిఫాల్టర్లుగా ప్రకటించింది. ఈ మిల్లర్లు రూ.417 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను ప్రభుత్వానికి ఇవ్వా ల్సి ఉంది. అయితే ఇందులో ఒక్క షకీల్ నుంచి రావాల్సిన బియ్యం విలువే రూ.60 కోట్ల మేర ఉండడం విశేషం.
కలకలం రేపిన అదనపు కలెక్టర్,
ఇద్దరు ఉన్నతాధికారులపై కేసు
ధాన్యం ఒకరికి ఇచ్చి.. సీఎంఆర్
మరొకరిని అడిగిన వైనం
దుబాయ్‌కు చెక్కేసిన
మాజీ ఎమ్మెల్యే షకీల్


