కామారెడ్డి టౌన్: మండలంలోని క్యాసంపల్లి పల్లె దవాఖానాకు ఎన్‌క్వాస్ కింద నాణ్యత సర్టిఫికేట్‌తో పాటు ఉత్తమ అవార్డు దక్కింది. నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌క్వాస్ బృందం ఆస్పత్రుల నిర్వహణపై తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రభుత్వ పల్లెదవాఖానాలకు ఎన్‌క్వాస్ నాణ్యత సర్టిఫికేట్‌లతో పాటు ఉత్తమ అవార్డులు అందించారు. ఇందులో క్యాసంపల్లి పల్లె దవాఖానాకు 88.05 మార్కులతో అవార్డు దక్కించుకుంది. ఈమేరకు వైద్యులు, సిబ్బందిని జిల్లా అధికారులు బుధవారం అభినందించారు.


