కామారెడ్డి రూరల్: మానవ అక్రమ రవాణాపై గ్రామ సంఘం అధ్యక్షురాళ్లకు, వీవోఏలకు విశ్రాంత ఉద్యోగుల సంఘంలో శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీవీటీ రాజేందర్ మానవ అక్రమ రవాణా నిర్మూలన కోసం గ్రామాల్లో మహిళలు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. మహిళా చట్టాలు, లైంగిక, శ్రమ, అవయావాలు, దోపిడి తదితర అంశాలపై అవగాహన కల్పించి గ్రామీణ మహిళలను చైతన్యవంతులు చేయాలని సూచించారు. ఈ శిక్షణ అనంతరం గ్రామాల్లోని చిన్న సంఘాల సమావేశాలలో సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మానవ అభివృద్ధి విభాగం రమేష్‌బాబు, ఏపీఎం మోయిజ్, గ్రామ సంఘాల అధ్యక్షులు, వీవోఏలు, సీసీలు, విశ్వనాథ్, అంజాగౌడ్, స్వరూపరాణి, సంజీవులు, మండల సమాఖ్య సిబ్బంది లావణ్య, లత, సవిత, టీవోటీలు రాజేందర్, జగదీష్ కుమార్, శ్రీనివాస్, అన్నపూర్ణ, గీత, మహిళ సాధికారిత కేంద్ర ప్రతినిధులు శిరీష, శారద, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.
పల్లెదవాఖానాను
పరిశీలించిన ఏఎస్పీ
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న పల్లె దవాఖానా వద్ద రెండు రోజుల క్రితం దినసరి కూలీ రాము మృతిచెందాడు. ఈ విషయమై ఏఎస్పీ చైతన్యారెడ్డి బస్వాపూర్ గ్రామానికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు.
మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది
కామారెడ్డి రూరల్: మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి సురేందర్ అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం 11 మండలాలకు చెందిన వారిలో మండలానికి ఆరుగురి చొప్పున శిక్షణను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పాఠశాల ఏకరూప దుస్తుల తయారీ బాధ్యత ప్రభుత్వంమహిళలకు అప్పగించిందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టు మిషన్‌లను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించిందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించి ముందు యూనిఫామ్ కుట్టడం నేర్పించినట్లు తెలిపా రు. బల్క్ కటింగ్, ఖాజాలు, బటన్‌లు, కొలతలు ఏవిధంగా తీసుకోవాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో డీపీఎం కె రమేష్ బాబు, ఏపీఎంలు రాజేందర్, మోయిజ్, టీవోటీలు, ఆజేశ్వరీ, సల్మా, 11 మండలాలకు చెందిన మహిళ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మహిళల చైతన్యంతోనే మానవ అక్రమ రవాణా నిర్మూలన
మహిళల చైతన్యంతోనే మానవ అక్రమ రవాణా నిర్మూలన