కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య ఆందోళన | - | Sakshi
Sakshi News home page

కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య ఆందోళన

Published Sat, Mar 22 2025 1:27 AM | Last Updated on Sat, Mar 22 2025 1:23 AM

ఆటో–బైక్‌ ఢీ: పలువురికి తీవ్ర గాయాలు

రామారెడ్డి: రామారెడ్డి శివారులో శుక్రవారం రాత్రి ఆటో–బైకు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి వైపు నుంచి రామారెడ్డి వచ్చే క్రమంలో వాహనాలు ఢీకొన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు వ్యక్తులకు, బైక్‌పై ఉన్న దినేష్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అర్గుల్‌ గ్రామస్తులపై కేసు నమోదు

జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్‌ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి శుక్రవారం తెలిపారు. అర్గుల్‌ గ్రామ శివారులోని తన భూమిలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి డ్యామేజ్‌ చేసినట్లు పాలెం గ్రామానికి చెందిన ఏలేటి రవీందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్గుల్‌ గ్రామస్తులు భాస్కర్‌రెడ్డి, అల్కన్న, శేఖ్‌పాషా, రాంరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఓ భార్య ఆందోళన చేపట్టిన ఘటన లింగంపేట మండలం కోమట్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. కేశాయిపేట గ్రామానికి చెందిన నెల్లూరి భాగ్య, కోమట్‌పల్లి గ్రామానికి చెందిన చీటూరి రాకేష్‌ ప్రేమించుకొని, పెద్దలను ఎదిరించి 2023లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలు హైదరాబాద్‌లో కాపురం చేయగా భాగ్య గర్భం దాల్చింది. ఈక్రమంలో ఆమెకు కడుపు నొప్పి రావడంతో భర్త కొన్ని మందులు ఇచ్చాడు. గత నెల 21న నొప్పి తీవ్రం కావడంతో వైద్య పరీక్షలు చేయించగా గర్భంలోని శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటినుంచి భార్యను రాకేష్‌ మానసికంగా వేధింపులు గురిచేస్తుండేవాడు. ఈక్రమంలో ఆమెను హైదరాబాద్‌ నుంచి కేశాయిపేటలోని తన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. శుక్రవారం రాకేశ్‌ కోమట్‌పల్లికి వచ్చినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె రాకేశ్‌ ఇంటికి వచ్చింది. దీంతో రాకేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లనంటూ బాధితురాలు టెంట్‌ వేసుకొని ఆందోళనకు దిగింది. అధికారులు, గ్రామస్తులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement