బాన్సువాడ : భద్రాది శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాల వాల్‌పోస్టర్లను శుక్రవారం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో డీఎం సరితాదేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరామ నవమి పుర్కరించుకొని స్వామివారి కల్యాణ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో హోం డెలివరీ చేస్తోందన్నారు. ఆర్టీసీ డిపో పరిధిలోని భక్తులు రూ.151 చెల్లిస్తే భద్రాది శ్రీ సీతారామచంద్ర స్వామి గోటి తలంబ్రాలతో పాటు రెండు ముత్యాల కల్యాణ తలంబ్రాలు ఇంటికి పంపిస్తామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9154298729ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిపో సూపరింటెండెంట్ బసంత్, ఆర్‌ఎంఈ కాశిరాం, డీఎంఈ ఇర్పాన్ ఉన్నారు.