కామారెడ్డి క్రైం : ప్రభుత్వ ఆస్పత్రులలో సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యులు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరగాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు నిర్వహిస్తూ జిల్లా జనరల్ ఆస్పత్రిలో రద్దీ తగ్గేలా చూడాలన్నారు. వడదెబ్బ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయ పాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు శిరీష, రాధిక, విద్య, ప్రభు కిరణ్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్