వాగ్దానానికే పరిమితం | - | Sakshi
Sakshi News home page

వాగ్దానానికే పరిమితం

Published Wed, Mar 19 2025 1:38 AM | Last Updated on Wed, Mar 19 2025 1:35 AM

సదాశివనగర్‌ మండలం లింగంపల్లి వద్ద చేపట్టిన తవ్వకం పనులు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మెట్ట ప్రాంతానికి గోదారమ్మను మళ్లించి రైతుల కష్టాలను తీర్చేందుకు రూ పొందించిన కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు ని ధుల గ్రహణం పట్టింది. ప్రభుత్వాలు మారుతున్నా ఈ ప్యాకేజీకి సంబంధించిన పనులపై రివ్యూలు జ రగకపోగా, నిధులూ ఇవ్వడం లేదు. దీంతో ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవెశ పెట్టనున్న బడ్జెట్‌లో 22వ ప్యాకేజీకి ఏ మైనా నిధులు ఇస్తారేమోనని రైతు లు ఆశగా ఎదురుచూస్తున్నారు. జి ల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి ని యోజవర్గాల్లో బొర్లు తవ్వించి అ ప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన ప్ర జాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పరామర్శించారు. తాము అధికారంలోకి రాగానే గోదావరి జలాలతో సాగునీటి క ష్టాలను తీరుస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చి న మాట ప్రకారం కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతోపాటు పొరుగున ఉన్న మెదక్‌ జిల్లాలోని రామాయంపేట ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు ప్రాణహిత–చేవెళ్ల పథకంలో 22వ ప్యాకేజీని రూపొందించారు. పనులకు కామారెడ్డి పట్టణం నడిబొడ్డున శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరు కావడంతో పనులు మొదలయ్యాయి. భూంపల్లి రిజర్వాయర్‌ పనులు చేపట్టి కాలువలూ తవ్వారు. సొరంగం పనులు చేప ట్టారు. అయితే వైఎస్సార్‌ మరణానంతరం నిధుల సమస్య వచ్చిపడింది.

పేరుమార్పు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాణహిత–చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చినా 22వ ప్యాకేజీని అలాగే కొనసాగించారు. అయితే నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ప్యాకేజీలో కీలకమైన భూంపల్లి రిజర్వాయర్‌ పనులు చేపట్టారు. అక్కడి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా మూడు ప్రాంతాలకు తరలించేందుకు లెఫ్ట్‌, రైట్‌, రిడ్జ్‌ కెనాల్స్‌ పనులు చేపట్టారు. అయితే కామారెడ్డి, భిక్కనూరు, లింగంపేట, రాజంపేట, గాంధారి మండలాల్లో రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన 3 వేల ఎకరాల భూసేకరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. భూసేకరణ జరిగితే ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పనులు మొదలుపెట్టొచ్చు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.2,100 కోట్లు అవసరం అవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. పనులు మొదలుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్నా పూర్తి కావడం లేదు. 22వ ప్యాకేజీ పూర్తి చేస్తే ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని గాంధారి, లింగంపేట, తాడ్వాయి, సదాశివనగర్‌, రామారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట మండలాలతోపాటు మెదక్‌ జిల్లాలోని రామాయంపేట, నిజాంపేట తదితర మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు కదలకపోవడానికి ప్రధాన కారణం నిధులు కేటాయించకపోవడమే.

కాళేశ్వరం 22వ ప్యాకేజీకి రూ. 2,100 కోట్లు అవసరం

నిధులు కేటాయిస్తేనే

నీళ్లు పరవళ్లు తొక్కేది!

ఏళ్లుగా ముందుకు కదలని పనులు

ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారా..

కాళేశ్వరం 22వ ప్యాకేజీ.. ఏళ్లు గడుస్తున్నా ముందుకు కదిలింది లేదు. రైతుల సాగునీటి గోసను పరిష్కరించే పనులను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని ఎన్నికల సమయంలో ప్రకటిస్తున్న నాయకులు తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా తమ భూముల్లోకి గోదారమ్మ ఎప్పుడొచ్చేదని రైతులు వాపోతున్నారు. పనులు పూర్తి చేసేందుకు రూ.2,100 కోట్లు అవసరం కాగా.. అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఆశలు పెరిగాయి.

కాళేశ్వరం 22వ ప్యాకేజీకి

రూ. 2,100 కోట్లు అవసరం

నిధులు కేటాయిస్తేనే నీళ్లు పరవళ్లు తొక్కేది!

ఏళ్లుగా ముందుకు కదలని పనులు

‘భట్టి’ బడ్జెట్‌పై రైతుల ఆశలు

ప్రతిసారి ఎన్నికల్లో 22వ ప్యాకేజీ అంశం వాగ్దానంగా మారుతోంది తప్ప పనులు ముందుకు కదలడం లేదు. సాగునీటి కోసం రైతులు దశాబ్దాలు పడుతున్న కష్టాలకు 22వ ప్యాకేజీ ఒక్కటే పరిష్కారమని పదే పదే చెప్పే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు నిధుల కోసం గట్టిగా ప్రయత్నించడం లేదు. ఏటా భూగర్భజలాలు అడుగంటిపోయి చేతికందే సమయంలో పంటలు ఎండిపోతుండడం, రైతులు అప్పులపాలవుతున్న విషయం తెలిసి కూడా నిధులు సాధించేందుకు చొరవ చూపడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థాయిలో సమీక్షలు జరిపి, అవసరమైన నిధులు సాధించేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భట్టి బడ్జెట్‌పై ఆశలు

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను బుధవారం శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.2,100 కోట్లు కేటాయిస్తే 22వ ప్యాకేజీ పనులు ముందుకు కదులుతాయి. నిధులు మంజూరు చేస్తేనే బీడు భూముల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతుందని, అప్పటి దాకా తమ కష్టాలు తీరేట్టు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రాజెక్టు పనుల పూర్తికి నిధులు కేటాయించి సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. అలాగే జుక్కల్‌ నియోజక వర్గ రైతులకు ఉపయోగపడే అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండితోపాటు నాగమడుగు ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement