కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 145 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూ సంబంధిత, డబుల్ బెడ్రూం ఇండ్లు, పించన్ లకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తప్పనిసరిగా అందజేయాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, జెడ్పీ సీఈవో చందర్, ఏవో మస్రూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజావాణికి 145 ఫిర్యాదులు