భిక్కనూరు: విద్యార్థులు చదువును కష్టం అనుకోకుండా ఇష్టపడి చదివితే మంచి మార్కులు సాధించవచ్చని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంధ్రకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జంగంపల్లిలో కస్తూర్బా పాఠశాలతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రాజ్‌గంగారెడ్డి, హెచ్‌ఎం రాజేంద్రప్రసాద్, కేజీబీవీ ఎస్‌వో హరిప్రియ, మాజీ ఎంపీపీ గాలిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ స్వామి కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యాక్షులు లింగారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మమత, నాయకులు మూర్తి ప్రకాశ్‌గౌడ్, రామస్వామి,బాబు, ఆమీర్, నర్సింలు పాల్గొన్నారు.
పరీక్ష సామగ్రి వితరణ
బీబీపేట/నిజాంసాగర్/తాడ్వాయి/కామారెడ్డి రూరల్/పిట్లం/మాచారెడ్డి/బాన్సువాడ రూరల్ : బీబీపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులకు అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ శ్రీగాధ శంకర్ పరీక్షల సామగ్రి వితరణ చేశారు. జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జుక్కల్ యూత్ ఫోరం ఆధ్వర్యంలో, తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ ఉన్నతపాఠశాలలో కాంప్లెక్స్ హెచ్‌ఎం సంగారెడ్డి ఆధ్వర్యంలో, కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ జెడ్పీపాఠశాలలో సేవా భారతి ఆధ్వర్యంలో, పిట్లం మండలం చిన్నకొడప్‌గల్ జెడ్పీ పాఠశాలలో లయన్స్ క్లబ్, మాచారెడ్డి మండలంలోని సోమారంపేట ఉన్నత పాఠశాలలో బంజారా టైగర్స్ స్వచ్ఛంద సంస్థ, పాల్వంచ మండలం భవానీపేట ఉన్నత పాఠశాలలో మాజీ ఉపసర్పంచ్ రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో, బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ జెడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎం వీరప్ప పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, కంపాక్స్ బాక్స్‌లు అందజేశారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్
చంద్రకాంత్‌రెడ్డి
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల అందజేత