సిబ్బందిపై నిఘా పెట్టేదెవరు? | - | Sakshi
Sakshi News home page

సిబ్బందిపై నిఘా పెట్టేదెవరు?

Mar 17 2025 11:05 AM | Updated on Mar 17 2025 10:59 AM

నిజామాబాద్‌ సిటీ: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అతి కీలకమైన మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌(ఎంహెచ్‌వో) పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నగరంలో పారిశుధ్య పనులు, తనిఖీలు సరిగా చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

నగరంలోని ఐదు జోన్లకు గాను ఐదుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లున్నారు.వీరిపై శానిటరీ సూపర్‌వైజర్‌, ఆ యనపై ఎంహెచ్‌వో పర్యవేక్షణ ఉండాలి. కానీ పారిశుధ్య పనులు కేవలం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మాత్ర మే చూస్తున్నారు. కానీ పైఅధికారి లేకపోవడంతో వారు విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నారు. నగరంలో ప్రతిరోజు 300 మెట్రిక్‌ టన్నుల చెత్త తయారవుతోంది. ఈ చెత్తను ఇంటింటి నుంచి సేకరించడం, మున్సిపల్‌ వాహనాల్లో తరలించడం, కూడళ్లలో వేసిన చెత్తను తొలగించడం వంటి నిత్య ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. డ్రైనేజీలు చెత్త, మురికినీటితో నిండిపోయాయి. అలాగే రెగ్యులర్‌ ఉద్యోగులు రాకున్నా వారికి హాజరువేసి వారి వద్దనుంచి నెలనెలా వసూళ్లకు పాల్పడుతున్నారు. అయినా వీరిపై అధికారులు నిఘా ఉంచడం లేదు.

తనిఖీలు కరువు..

నగరంలో 200 వరకు ఫుట్‌పాత్‌ల మీదనే హోటళ్లు, దుకాణాలు నిర్వహిస్తున్నారు. నాణ్యతలేని సరుకు లు వాడటంతోపాటు అపరిశుభ్రంగా ఉన్న స్థలాల్లో తినుబండారాలు విక్రయించడంతో నగరవాసులు అనారోగ్యం పాలవుతున్నారు. అయినా వీరిపై ఎ లాంటి తనిఖీలు లేవు. టిఫిన్‌సెంటర్ల వద్ద ప్రతీనెల సిబ్బంది మాముళ్లు వసూలు చేసినా పట్టించుకునేవారు లేదు. పాలిథిన్‌ బ్యాగ్‌లపై నిషేదం ఉన్నా కిరాణదుకాణాలు, టిఫిన్‌సెంటర్లు, కూరగాయలు, పండ్ల వర్తకుల వద్ద తనిఖీలు చేయడం లేదు. కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ట్రేడ్‌ లైసెన్స్‌లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంహెచ్‌వో పోస్టు భర్తీ చేస్తే బల్దియా సిబ్బందిపై నిఘా ఉంచి, అందరూ సక్రమంగా విధుల నిర్వహించేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బల్దియాలో ఎంహెచ్‌వో పోస్టును భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.

బల్దియా కార్యాలయం

నిజామాబాద్‌ బల్దియాలో

ఎంహెచ్‌వో పోస్టు ఖాళీ

రెండేళ్లుగా భర్తీ చేయని అధికారులు

నియంత్రణ లేక ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

త్వరలో నియమిస్తాం

బల్దియాలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంహెచ్‌వో పోస్టు కూడా ఖాళీగా ఉంది. సీడీఎంఏకు తెలియజేశాం. డిప్యూటీ కమిషనర్‌ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నేను తనిఖీలు నిర్వహిస్తున్న. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిని హెచ్చరిస్తున్నా.

–దిలీప్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌

అధికారులు పట్టించుకోవడం లేదు

మా ఇంటిముందు డ్రెయినేజీ లు నిండిపోయి మురికినీరు రో డ్డుమీద పారుతోంది. మున్సిప ల్‌ అధికారులకు ఎన్నిసార్లు చె ప్పినా పనులు చేయడం లేదు. నగరంలో పారిశుధ్య వ్య వస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఉన్నతాధికారులు సంబంధిత అధికారిని నియమిస్తే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. –శ్రీనివాస్‌, జవహర్‌ రోడ్డు వాసి

సిబ్బందిపై నిఘా పెట్టేదెవరు? 1
1/2

సిబ్బందిపై నిఘా పెట్టేదెవరు?

సిబ్బందిపై నిఘా పెట్టేదెవరు? 2
2/2

సిబ్బందిపై నిఘా పెట్టేదెవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement