శుభకార్యానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి..

Jul 24 2023 12:24 AM | Updated on Jul 24 2023 8:55 AM

- - Sakshi

కామారెడ్డి: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పాల్వంచ మండలం ఆరేపల్లి శివారులో చోటు చేసుకుంది. మాచారెడ్డి ఎస్సై రాజారామ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన అల్లి శ్రీకాంత్‌రెడ్డి(35) కొన్నేళ్లుగా కామారెడ్డిలో కార్‌ డెకార్స్‌ నడుపుతూ హౌజింగ్‌ బోర్డు కాలనీలో భార్య, పిల్లలతో నివాసముంటున్నాడు.

ఆయన ఇద్దరు మిత్రులతో కలిసి తన కారులో ఫరీదుపేటలో జరిగిన ఓ శుభ కార్యానికి హాజరై కామారెడ్డి వెళ్తున్నాడు. ఆరేపల్లి శివారులో ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్‌ వాహనం కారును ఢీకొంది. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

అలాగే టాటా మ్యాజిక్‌ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య భాగ్య రేఖ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement