భర్త తన మాట వినడం లేదని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భర్త తన మాట వినడం లేదని ఆత్మహత్య

Jun 21 2023 1:17 AM | Updated on Jun 21 2023 1:17 PM

- - Sakshi

బాల్కొండ: భర్త తన మాట వినడం లేదని మనస్తాపం చెంది భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముప్కాల్‌ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కరచారి తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పన్నీరు రేవతి(37), కిషన్‌ దంపతులు. సోమవారం కిషన్‌ తన చెల్లికి రూ.2వేలు పంపడంతో, భర్తతో భార్య గొడవ పడింది. భర్త తన మాట వినకుండ డబ్బులు పంపుతున్నాడని ఆమె మనస్తాపం చెందింది. ఈక్రమంలో మంగళవారం ఉదయం భర్త కిషన్‌, చిన్నకుమారుడు అభినవ్‌ వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంట్లో ఉ న్న పెద్ద కుమారుడు అభినయ్‌ నిద్రలేచి చూసేసరికి తల్లి ఉరి వేసుకుంది. అతడు తన బాబాయ్‌ సహయంతో తల్లిని కిందకు దించి వెంటనే బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు సూచించడంతో పెర్కిట్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి కమ్మం ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ఒంటరితనం భరించలేక యువకుడు..
బిచ్కుంద(జుక్కల్‌):
మండలంలోని ఓ రైస్‌మిల్లులో లేబర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఒంటరితనం భరించలే క ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రీధర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండంలోని గోపన్‌పల్లి గ్రామంలోని వెంకటసాయి రైస్‌మిల్లులో గత కొంతకాలంగా బీహార్‌కు చెందిన యువకుడు సరోజ్‌ కుమార్‌ (20) లేబర్‌గా పనిచేస్తుండేవాడు. గత కొన్ని రోజుల నుంచి అతను ఇంటికి దూరంగా ఉన్నానని బాధపడుతూ, తరచూ బీహార్‌ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయితో ఫోన్‌ మాట్లాడుతూ ఉండేవాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి రైస్‌మిల్‌లో లేబర్లందరూ భోజనం ముగించుకుని నిద్రిస్తున్న సమయంలో సరోజ్‌ కుమార్‌ ఒక తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటరితనంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి అన్న దిలీప్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో ఒకరు..
గాంధారి(ఎల్లారెడ్డి):
మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏఎస్సై గంగారాం తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రంలోని దుర్గా నగర్‌కు చెందిన దర్బ స్తు శ్రీనివాస్‌(38) వారంరోజుల పాటు భార్య, పి ల్లలతో కలిసి అత్తవారింటికి వెళ్లాడు. మూడు రోజుల క్రితం భార్య పిల్లలను అక్కడే ఉంచి ఒక్కడే గాంధారికి తిరిగి వాచ్చాడు. సోమవారం రాత్రి ఆర్థి క ఇబ్బందులు కారణంగా సొంతింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం కాలనీ వాసులు గమనించి బంధువులకు సమాచారం ఇ చ్చారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

పరీక్షలు సరిగా రాయలేదని విద్యార్థి..
ఖలీల్‌వాడి:
డిగ్రీ పరీక్షలు సరిగా రాయలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. మూడో టౌన్‌ ఎస్సై శ్రావణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని పంబోలి కాలనీకి చెందిన మహేష్‌(20) ఓ ప్రయివేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాడు. ఈక్రమంలో ఇటీవల నిర్వహించిన పరీక్షలను మహేష్‌ సరిగా రాయలేదు. దీంతో మంగళవారం అతడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమేరకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement