నిఖత్‌ జరీన్‌కు పతకం ఖాయం

- - Sakshi

నిజామాబాద్‌నాగారం: ప్రత్యర్థులు తన పంచులతో మట్టికరిపిస్తు... వరుస విజయాలతో దూసుకెళ్లుతున్న నిఖత్‌కు పతకం ఖాయం అయింది. ఉమెన్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌జరీన్‌ హవా కొనసాగుతుంది. బుధవారం ఢిల్లీలో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో థాయిలాండ్‌కు చెందిన బాక్సర్‌పై నిఖత్‌ 5–2 తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. గురువారం సెమీస్‌లో కొలంబియకు చెందిన ఇంగ్రితతో పోటీ పడనుంది.

పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

ధర్పల్లి(ఇందల్వాయి): పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. గోవిందు నరేష్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగల సంగ్రామ యాత్ర బుధవారం ఇందల్వాయి మండలం తిర్మాన్‌పల్లి గ్రామానికి చేరుకుంది. ఈ యాత్రకు జిల్లా కన్వీనర్‌ కనుక ప్రమోద్‌ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ కులస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో గోవిందు నరేష్‌ మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేక విద్య, ఉద్యోగ రంగాల్లో మాదిగలకు అన్యా యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్ర స్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశా ల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 4న నిర్వహిస్తున్న హైదరాబాద్‌ ముట్టడికి తరలి రావాలని కోరారు. నాయకులు భూమన్న మాదిగ, రొడ్డ ప్రవీణ్‌, బాలు యాదవ్‌, శ్రీకాంత్‌, మహిపాల్‌, అభిలాష్‌, మహేందర్‌ పాల్గొన్నారు.

బోర్గాంలో ఉద్రిక్తత

రెంజల్‌: మండలంలోని బోర్గాం గ్రామంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉగా ది సందర్భంగా గ్రామ శివారులో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. చివరి కుస్తీకి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తుండగా రెంజల్‌ గ్రామానికి చెందిన యువకుడు నిర్వాహకుడి చొక్కా పట్టుకుని నెట్టివేశాడు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా అతన్ని పట్టుకుని చితకబాదారు. గ్రామ శివారు నుంచి వెంటబడి తరిమారు. చివరకు పోలీసులు చేరుకుని యువకుడిని వాహనంలో ఎక్కించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు వాహనం ముందు భైఠాయించారు. చివరకు గ్రామపెద్దలు నచ్చచెప్పడంతో యువకులు శాంతించారు. పోలీసులు గొడవకు కారణమైన యువకుడిని స్టేషన్‌కు తీసుకరాగా బోర్గాం గ్రామస్తులు యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తరలివచ్చారు.

Read latest Kamareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top