● హైవేపై పైథాన్‌! | - | Sakshi
Sakshi News home page

● హైవేపై పైథాన్‌!

Oct 25 2026 12:23 AM | Updated on Oct 25 2026 12:23 AM

మండల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారిపై శనివారం ఒక భారీ కొండచిలువ హల్‌చల్‌ చేసింది. నిడదవోలు – పంగిడి ప్రధాన రహదారిపై అది రోడ్డు దాటుతుండడాన్ని గమనించిన వాహనచోదకులు, బాటసారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అది సురక్షితంగా రోడ్డు దాటే వరకు ఇరువైపులా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపివేశారు. స్థానిక షుగర్‌ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌ వైపు నుంచి వచ్చిన ఆ కొండచిలువ మెల్లగా రోడ్డు దాటి ఫ్యాక్టరీ ప్రాంగణం వైపు వెళ్లిపోయింది. ఈ లోగా పాదచారులు, వాహన చోదకులు దాని గమనాన్ని వారి కెమేరాలలో భద్రపరచుకున్నారు. – చాగల్లు

గణపతినగరం వాటర్‌ ట్యాంకుల వద్ద చేపట్టిన పనులు

స్థానిక గణపతినగరం వాటర్‌ ట్యాంకుల వద్ద ఇప్పటి వరకు గుర్తు రాని పనులు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ట్యాంకుల వద్ద ప్రహారీ కూలి రెండు నెలలవుతున్నా అధికారులు పట్టించకోలేదు. మున్సిపల్‌ కోడ్‌ అమలులో ఉండగా ఈ పనులు చేపట్టడంపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడడానికే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పనులపై కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు స్థానికులు చెప్తున్నారు.

– సామర్లకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement