ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ఐ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ఐ ఎంపికలు

Oct 25 2026 12:23 AM | Updated on Oct 25 2026 12:23 AM

జిల్లా వ్యాప్తంగా 800 మంది హాజరు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడా సమాఖ్య అండర్‌–14, 17 ఆధ్వర్యంలో శనివారం జిల్లా క్రీడామైదానంలో జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎంపికలను జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్‌–14, 17 కార్యదర్శలు పి.శ్రీనివాస్‌, శేషుకుమారి ప్రారంభించారు. రైఫిల్‌ షూటింగ్‌, కురాషూ, హ్యాండ్‌బాల్‌, హాకీలో నిర్వహించిన ఎంపికలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిఽధిలో అండర్‌–14, 17 బాలురు, బాలికల విభాగంలో 800 మంది హాజరయ్యారు. డీఎస్‌ఏ హాకీ కోచ్‌ నాగేంద్ర, రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌ సమీర్‌ ఈ ఎంపిలకు టెక్నికల్‌ ఆఫీషియల్స్‌గా వ్యవహరించారు. ఎంపికల నిర్వహణలో పీడీలు రవిరాజు, రవికౌర్‌, నాగలింగేశ్వరరావు, కె.పట్టాభిరాం, గుత్తుల శ్రీనివాస్‌, స్వామి, కె.శ్రీనివాస్‌, సురేష్‌రాజు, ఇస్రాయేల్‌ రాజు, మాచరరావు, హరిబాబు, ప్రసాద్‌, మాజీ స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి బి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement