తొండంగి: పెరుమాళ్లపురం బీచ్‌లో సముద్రస్నానానికి వెళ్లి గల్లంతైన యశ్వంతిక మృతదేహం శుక్రవారం అర్ధరాత్రి లభ్యమైంది. శుక్రవారం బాలిక గల్లంతైన తర్వాత మత్స్యకారులు సాయంత్రం వరకూ సముద్రంలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే గల్లంతైన ప్రదేశానికి సమీప తీరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జగన్మోహన్‌రావు, ఇతర సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టమ్‌కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.


