తుని రూరల్: కురాష్ రాష్ట్రస్థాయి పోటీలకు తమ విద్యార్థినులు ఎంపికై నట్టు వి.కొత్తూరు కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రిన్సిపాల్ అమృతవాణి శనివారం తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన అండర్–14 పోటీల్లో కొల్లు ప్రశాంతి (24 కేజీలు) ప్రధమస్థానం, మదాడ సారిక (36 కేజీలు) ప్రధమ స్థానం, లాలం లోష్మిత (36 కేజీలు) ద్వితీయ స్థానం, లాలం మనస్విని (48 కేజీలు) ప్రధమ స్థానం, కొల్లు శాంతిప్రియ (48 కేజీలు) ప్రధమ స్థానం, పెద్దాడ అను (40 కేజీలు) ప్రధమ స్థానంలో గెలుపొందారన్నారు. అండర్–17 విభాగంలో ఎస్‌కే సమీరా (52 కేజీలు) ప్రధమ స్థానంలో నిలిచినట్టు ఆమె వివరించారు. ప్రధమ స్థానంలో నిలిచిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్టు తెలిపారు.


