నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించండి | - | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించండి

Oct 25 2026 12:17 AM | Updated on Oct 25 2026 12:17 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకురాలు, వ్యయ పరిశీలకులు గరుడ్‌ సంకేత్‌ సునీల్‌, జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌, ఎస్పీ బిందుమాధవ్‌తో కలసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ముందస్తు ఏర్పాట్లు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, శిక్షణ, పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ, భద్రతా చర్యలు తదితర అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సాధారణ పరిశీలకులకు, వ్యయ పరిశీలకులకు వివరించారు. లావణ్యవేణి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో మొత్తం 1,312 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, గత ఎన్నికల్లో సమస్యలు తలెత్తిన, సున్నితమైన ప్రాంతాల్లోని 626 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సంబంధిత అధికారుల సమన్వయంతో ఇప్పటికే 257 కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించామని, మిగిలిన కేంద్రాల్లోనూ రానున్న ఒకటి, రెండు రోజుల్లో అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement