● అధికారంలోకి వచ్చినప్పటి
నుంచీ సిటీ ఎమ్మెల్యేది ఇదే తీరు
● కాకినాడలో విచ్చలవిడిగా
సింగిల్ నంబర్, పేకాట
● అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
● కొండబాబుపై నిప్పులు చెరిగిన
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎలా సంపాదిద్దాం, ఎలా దోచుకుందా, ఎలా దాచుకుందామనే పంథానే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నిప్పులు చెరిగారు. తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండబాబు, ఆయన కుమారులకు కార్లు ఎలా వచ్చాయని, అవినీతి సొమ్ముతో చైన్నైలో ఆస్తులు కొనలేదా అని ప్రశ్నించారు. నగరంలోని ఒక్కో మద్యం షాపు నుంచి ఎమ్మార్పీపై రూ.10 కొండబాబు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. స్మార్ట్ సిటీ నిధుల విడుదల పేరిట కాంట్రాక్టర్ల వద్ద 4 శాతం పర్సంటేజీలు గుంజుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ల నుంచి లంచాలు గుంజలేదా అని ప్రశ్నించారు. రేషన్ షాపుల వద్ద సైతం డబ్బులు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు, తర్వాత కొండబాబు వియ్యంకుడి ఆస్తులను పరిశీలిస్తే అవినీతి బండారం బయట పడుతుందని అన్నారు. నగరంలో పగటిపూటే సింగిల్ నంబర్ లాటరీలు, క్లబ్బుల్లో పేకాట మాఫియా రాజ్యమేలుతున్నాయని ఫైరయ్యారు. ఈ దోపిడీపై జిల్లా ఎస్పీ, ఎకై ్సజ్ శాఖ తక్షణమే ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.
డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణకు సిద్ధమా?
కొచ్చిన్ విమానాశ్రయం డ్రగ్స్ కేసులో తన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే కొండబాబు, దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ద్వారంపూడి సవాల్ విసిరారు. విచారణ చేయించి, నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో బురద జల్లితే సహించేది లేదని హెచ్చరించారు. కొచ్చిన్‌లో తమ ప్రభుత్వం ఉంటే తనను అరెస్టు చేయించేవాడినని ఎమ్మెల్యే కొండబాబు చెప్పడం హాస్యాస్పంగా ఉందన్నారు. శ్రీకేంద్రం, రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది. దమ్ముంటే విచారణ జరిపించాలిశ్రీ అని అన్నారు. డ్రగ్స్ కేసులో అరుణ్ కుమార్ అనే వ్యక్తి మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ బ్యాగ్‌లో నిషేధిత సరకు పెట్టినట్లు డీఆర్‌ఐ రిమాండ్ రిపోర్టులో వెల్లడైందని, అందుకు సంబంధించిన పత్రాలను ద్వారంపూడి చూపించారు. ఆరోపణలు వెలువడిన వెంటనే సత్యనారాయణను వైఎస్సార్ సీపీ నుంచి సస్పెండ్ చేశామని ద్వారంపూడి చెప్పారు. అనాథరైజ్డ్ డ్రగ్స్ కొనాలంటూ హాస్పిటల్స్‌పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. డంపింగ్ యార్డు సమీపంలో తాను డ్రగ్స్ వ్యాపారం చేశానంటూ కొండబాబు ఆరోపిస్తున్నారని, రెండున్నరేళ్లుగా ఒక్కటైనా నిరూపించలేకపోయారని ద్వారంపూడి అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనపై బురద జల్లడం కొండబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. గతంలో బియ్యం ఎగుమతుల్లో అవినీతి జరిగిందంటూ గగ్గోలు పెట్టారని, కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా ఏమైనా కనిపెట్టారా అని ప్రశ్నించారు. శ్రీమీరు చేసిన అల్లరికి కాకినాడ పోర్టు, ఆయా సంఘాల కార్మికులు రూ.వెయ్యి కోట్లు నష్టపోయారు. బియ్యం ఎగుమతిదారులు కాకినాడ పోర్టును వదిలేసి విశాఖపట్నం, చైన్నె, కాండ్లా పోర్టుల నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. యాంకరేజ్ పోర్ట్ అభివృద్ధికి రూ.80 కోట్లు వెచ్చించి, బియ్యం ఎగుమతిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే.. కూటమి అధికారంలోకి వచ్చి నాశనం చేసిందిశ్రీ అని మండిపడ్డారు. పోర్టు అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి పాటు పడాల్సింది పోయి, తమపై బురద జల్లడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
తాము అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం 550 ఎకరాలు కొనుగోలు చేసి, 36 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని ద్వారంపూడి గుర్తు చేశారు. రెండున్నరేళ్లలో ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చినట్లు చూపించగలరా అని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. చేతకాని అసత్య ప్రచారాలు, బురదజల్లే రాజకీయాలు కట్టిపెట్టి, చేతనైతే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మత్స్యకారులకు రాయితీలు అందడం లేదని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మత్స్యకార భరోసా అందలేదని ఇంటి వద్ద ధర్నా చేసినా స్పందించిన దాఖలాల్లేవన్నారు. కాకినాడలో మూడో బ్రిడ్జి నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. నగర అభివృద్ధి, ఇతర అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హత్యకు గురైన సతీష్‌రెడ్డి భార్య ఆరోపణలు చేసిన తర్వాత కటౌట్ శ్రీనును తప్పించారని అన్నారు. కాకినాడలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే కొండబాబు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేగా కొండబాబు ఎలా గెలిచారో అందరికీ తెలుసని, జనసేన మద్దతు లేకపోతే కాకినాడలో ఆయనకు రాజకీయ స్థానం ఉండదని ద్వారంపూడి అన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుంకర విద్యాసాగర్, మీసాల ఉదయ్ కుమార్, సంగాని బ్రహ్మం, జేడీ పవన్ కుమార్, గద్దేపల్లి దాసు తదితరులు పాల్గొన్నారు.


