టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్‌ సీపీలోకి.. | - | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్‌ సీపీలోకి..

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

ఏలేశ్వరం/కిర్లంపూడి: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు గురువారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. జనసేన నుంచి ఏలేశ్వరం 28వ వార్డుకు చెందిన మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ మసిరపు బుజ్జి, ఆమె భర్త నాగేశ్వరరావుతో పాటు పలువురు వైఎస్సార్‌ సీపీకి జైకొట్టారు. అలాగే, 26వ వార్డులో టీడీపీకి చెందిన తాపీమేసీ్త్ర సంఘం అధ్యక్షుడు గెద్ద అప్పన్నతో పాటు సుమారు 30 మంది మహిళలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఘన విజయం ఖాయమని ఆయనన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బదిరెడ్డి గోవిందు, దళే కిషోర్‌, లోగీసు శేఖర్‌, బీశెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు. కాగా, ఏలేశ్వరం మండలంలో వైఎస్సార్‌ సీపీ భద్రవరం గ్రామ అధ్యక్షుడు బందిల అంకాలు, మాజీ సర్పంచ్‌ కూనపురెడ్డి సుబ్బారావు, కాకర రాంబాబు, ఇసుకపల్లి బుజ్జి ఆధ్వర్యాన టీడీపీకి చెందిన 50 కుటుంబాలు ఫ్యాన్‌ నీడకు చేరాయి. వారికి కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ గిరిబాబు వైఎస్సార్‌ సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement