టీడీపీ, జనసేనకు బై.. వైఎస్సార్‌ సీపీకి జై | - | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేనకు బై.. వైఎస్సార్‌ సీపీకి జై

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

తుని/తుని రూరల్‌: టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పి, వైఎస్సార్‌ సీపీకి జైకొట్టారు. తుని పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు కుసనంపూడి శ్రీనివాసవర్మ, ఆయన కుమారుడు నరసింహవర్మ; తొండంగి మండలానికి చెందిన జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా పరిశీలకుడు గరికిన రాజబాబు, మండల అధికార ప్రతినిధి పెదిరెడ్ల దుర్గా ప్రసాద్‌ వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పార్టీ కండువాలు వేసి, స్వాగతం పలికారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి రాయి మేరీ అవినాష్‌, మాజీ సర్పంచ్‌ అత్తి వెంకట రమణ ఆధ్వర్యాన హంసవరానికి చెందిన బీజేపీ, టీడీపీకి చెందిన నాయకులు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ చైర్మన్‌ కలిదిండి సత్యనారాయణరాజు, నాయకులు పాల్గొన్నారు.

కిర్లంపూడి: ఏలేశ్వరం మండలం యర్రవరంలో కూటమికి చెందిన మాజీ ఉప సర్పంచ్‌, మాజీ డైరెక్టర్‌ దాసరి రాము, మరో 20 కుటుంబాల వారు బుధవారం కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు.

మాధవపట్నంలో..

సామర్లకోట: స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మాధవపట్నం గ్రామంలో జనసేనకు చెందిన ఏడు కుటుంబాలు బుధవారం వైఎస్సార్‌ సీపీలో చేరాయి. ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా నాయకుడు మేడిశెట్టి బుజ్జి ఆధ్వర్యాన వీరు పార్టీ లో చేరారు. తోటకూర రాజు, తోటకూర వీర సత్యనారాయణ, చింతపల్లి నాగరాజు, మద్దిల నాగులు, మందపాటి శివ, వనపర్తి వాసులకు సామర్లకోటలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు కండువాలు వేసి, స్వాగతం పలికారు. ఎంపీపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు గెలిచేలా కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement